Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జీవన్మతమేది.

37

"In the presence of the Scientific religions-Brahmanism Buddhism. Judaism & Muhammadanism-It has signally failed and there is no prospect of an eventual victory"

(శాస్త్రీయమతములగు హిందూమతము, బౌద్ధమతము, యూదమతము, మహమ్మదీయమతముముందఱనిది పరాజయమును బూర్తిగానందినది. ఇఁక నిదిజయమందు నాశయును లేదు.)

బ్రహ్మసమాజమతము నిన్నపుట్టినదనుటకు సందియమించుక యునులేదుగదా. ఇది యితరమతముల దెబ్బతగుల నక్కఱలేకయే వానిధాటినిగానియే క్షీణింవఁజొచ్చినది. ఇట్లసూయచే నేననుచున్నానని భ్రమింపవలదు. బ్రాహ్మసామాజికాగ్ర గణ్యులగు శివనాధశాస్త్రులవారీనడుమ కలకత్తాపురమున నిచ్చిన యుపన్యాసమే యీయర్థమును బోధచేయుచున్నది: ఇక్కాలంబునఁ దమబ్రహ్మ సమాజముతగ్గి పోవుటకు శివనాధశాస్త్రీగారాఱేడు కారణముల నిచ్చి యుండిరి. అందులోవారుచెప్పిన ఆఱవ కారణము ఈ క్రింది దైయున్నది.

"Next come the growth and development of such reactionary organisations as the Theosophical Society or Ramakristna mission.”

(దివ్యజ్ఞానసమాజము రామకృష్ణమఠమునను పునరుజ్జీవకమతములు బయలువెడలుట తరువాతి కారణమైయున్నది.