Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జీవన్మతమేది.

33

resulted in making him more and more mentally and spiritually powerful than physically."

(ప్రజ్ఞానవిజ్ఞానములు రెండిటియందును గూడ వంగ దేశ మందలి యొక్క సామాన్యమానవునితోఁ గూడ నెప్పటికిని నొక వుంజెడింగ్లీషువారునుగూడ సమానము కాఁజాలరు. శ తసహస్రవర్షములనుండి వచ్చుచున్న యధ్యాత్మ విద్య నినుభయజ్ఞానఘనుని చేసినది)

ఈరీతిగాఁ బ్రామాణ్యవాక్యముల నిచ్చుచుఁబోయినయె డల వేనవేలుకలవు. క్రైస్తవులే యిందుల కంగీక రించియు న్నారు.

ఆథ్యాత్మిక హిందూమతము (Philosophic Hinduism) అను గ్రంధములో క్రైస్తవ మతబోధకులే ఇట్లు వ్రాసియు న్నారు.

"There is no sharp line of demarcation between Popular and Philosophic Hinduism. They blend into each other. Some combine the two. Even the common people are leavened, more or less, with some of the notions of philosophic Hinduism.”

(లౌకిక హిందూమతమునకు నాధ్యాత్మిక హిందూ మత మునకు నెన్నఁదగిన హద్దేదియును లేదు. ఒక దానిలో నొక టికలసి యున్నవి. కొందఱుభయమును గలిపి వేయుదురు. పామరజనులుకూడ, చాల భాగము, ఆధ్యాత్మిక హిందూ మతధర్మముల నెఱింగిన వారలై యున్నారు.