Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

ఉపన్యాసపయోనిధి

ద్రియలోలురై యుందురు. ఇచ్చటి సాధారణపు పనివానిస్థితి కంటె నచ్చటి వాండ్రస్థితిమిక్కిలి తక్కువగా నుండును)

రావు బహద్దర్ వీరేశలింగముపంతులవా రీక్రింది వాక్యము లను వాయించియున్నారు:---

“ ఇతర విషయములందు (విగ్రహారాధనము కాక) మన లోని పామరులు కొందరు విగ్రహారాధనలేని జాతులవారిలో ని పామరులకంటే జ్ఞానాధికులైయుండుటయు, మఱికొంద ఱు వారికంటె జ్ఞానహీనులుగా నుండ కుండుటయు, మన ము స్వానుభవమువలన నెఱిఁగియున్నాము."

హిందూపత్రికలోనిట్లు వ్రాయబడియున్నది.

"Foreigners make a most lamentable mistake when th- ey suppose that the so-called lower classes in India are on the same level of thoughtless brutality that they find prevalent among corresponding sections of the people in other lands." (వరదేశస్థులు తమతమ దేశములందలి పామరు లెంత జ్ఞానహీనులై పశుప్రాయులైయున్నారో యంతేజ్ఞానహీను లు పశుప్రాయులై హిందూదేశమునందలి పామరులుకూడ నున్నారని చాలా పొరపడుచున్నారు)

బాబు సురేంద్రనాధ మొకర్జిగా రిట్లు వ్రాసియున్నారు:-

"Mentally and spiritually the average Bangalee is any day equal to a dozen John Bull. Centuries of worship with the unusual amount of spirituality has