Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జీవన్మతమేది.

29


గాని కలిగియుండకపోవుటచే నుభయులకును గాక లోలో క్షీణించుచున్నవని తెలిసికొంటిమి గాన నీవిషయముం గూర్చి, యిఁకహిందూమతమును విచారింతము.

హిందూమతమునందు సత్యవాదినిలోఁ దెల్పినరీతిగా లో కైకాద్భుతమై ప్రాజ్ఞులకు మనశ్శాంతిని గలిగించు వేదాం తము (జ్ఞానమార్గము)ను సామాన్యజనుల కక్కఱకువచ్చు స్థూలమార్గములగు విగ్రహారాధనాదికములును గూడఁ గల వు. హిందువుల విగ్రహారాధనము పరదేశస్థుల విగ్రహారా ధనమఃవలె నర్ధశూన్యము కాదు. సూక్ష్మమై ప్రాజ్ఞుల కా నందమును గిలిగించు వేదాంతము స్థూలమై యజ్ఞులకుఁ గూ డ గోచరమగునట్లు విగ్రహరూపమున మన పెద్దలా వేదాంత ము నే బోధించియుండిరి, కావున మన హిందూదేశము నం దలి జనులెల్లరు స్థూలనూక్ష్మమార్గములచే దివ్యజ్ఞానమును సంపాదించుకొనినారు.

హిందూదేశమందలి సామాన్యజనులు ఇతర దేశములందలి సామాన్యజనులు,

బ్రాహ్మ సామాజికాగ్రగణ్యులగు శివనాథశాస్త్రిగారు త మమతము జనసామాన్యము నుపేక్షించు చున్నదని నొక్కి వ్రాసియే యున్నారుగదా. ఇక క్రైస్తవ దేశములందలి జ నసామాన్యము యొక్క గతి యెట్లున్నది హిందూ దేశము నందలి జనసామాన్యము యొక్క స్థితి యెట్లున్నదని విచా రించుకొనవలెను. హూణవిద్య నాఘ్రాణించిన వారిలోఁబలు వురు క్రైస్తవులు విశాలహృదయులై తమమతమును విచ్చ