మొదటిబ్రాహ్మూవివాహము.
469
Rs. 25 and B. V. Jogayya, District Court Shirastadar Vizagapatnam, a pair of clothes to the married couple"
దీనినిబట్టి యాభరణములను వస్త్రములను రొక్కముnuగూడ కట్నముగాఁ బలువురుచేఁ జదివింపఁబడినట్లు తెలియవచ్చుచున్నది. ఈకట్నములనుగూర్చి కూడ ముందు విరివిగావ్రాయుదును.
శ్రీవీరేశలింగముపంతులువారు కట్నములు మున్నగువానిని గూర్చి వివాహవ్యయములను శీర్షికక్రింద నిట్లువ్రాయించియున్నారు.
"మనలోని చదువుకొన్నవారందఱును జేరి వివాహాదిశుభకార్యములయందు సాధ్యమయినంతవఱకిట్టి వ్యయములను తగ్గించుటకయి ప్రయత్నించి ముందుగా తామట్లుచేసి చూపి యితరులచేత చేయింపవలయును.”
తమలో చదువుకొనినవారు పలువురుచేరినదీ వివాహము. తమపెద్దతనము మీఁద సాగినది. కాన నితరులకు దారిచూపుటకై యీచదువుకొనినవారందఱును బంగారు గడియారములను రత్నోర్మికలను వస్త్రములను మున్నగువానిని ఈ ప్రాంతములందు జరిగిన యీప్రథమబ్రాహ్మూ వివాహము నందు కట్నముచదివించి యిందుమూలముగా నితరులకు దారిచూపిరి కాబోలు !!!
ఇది బ్రాహ్మసామాజికుల విగ్రహారాధనములేని నిష్కళంకమగు యుక్తివిరుద్ధముగాని బ్రాహ్మూవివాహమంట !