Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/495

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

468

ఉపన్యాసపయోనిధి.

దీనినిబట్టి దృష్టిదోషపరిహారార్ధముగా హిందువులు మంగళారతి నిత్తురని తేలుచున్నది. ఈ బ్రాహ్మూలకును దృష్టిదోషమునందు నమ్మకముకలదా? లేకున్న హిందువులవలె వీరును మంగళారతి నిచ్చుటలో విశేషమేముండఁగలదు.

కట్నములు.

తరువాతిది గొప్పవిశేషము. అది యేదియన కట్నములు. ఇవికూడవని ఇదివఱకు శ్రీశ్రీశ్రీ రావుబహదరు వీరేశలింగముపంతులువారు మున్నగు మహామహులు పెద్దపెద్దవ్యాసములు వ్రాసియున్నారు. ఇందునుగూర్చి వివాహవ్యయములను శీర్షికక్రింద శ్రీవీరేశలింగముపంతులవారిట్లు వ్రాసిరి. "ఈయాచారముతోడనే వివాహసమయములయందు బంధువులు కట్నముతెచ్చెడి యాచారముకూడపోవలయును.” అయినను శ్రీవీరేశలింగముపంతులవారింట జరిగిన యీవివాహమహెూత్సవము కట్నములు చదివించు మహావైభవము నందియే శోభించినది. ఇందునుగూర్చి మెస్సంజరుపత్రిక యిట్లువ్రాయుచున్నది.

"The young Raja of Pittapur with his usual liberality presented the bridegroom with a pretty gold watch and chain, and the bride with a gold ring set with diamond and saphire worth about Rs. 300. There were presents from others also among whom Mr. R. Venkataratnam Naidu Garu M. A., L, T., Principal of the Pittapur Raja's College Coconada presented Rs. 15. The young Zamindar of Kapileswarapuram