మొదటిబ్రాహ్మూవివాహము.
463
యజ్ఞోపవీతములు విగ్రహారాధకములని నిందించి వానిని దీసివేయుచున్న యీబ్రాహ్మూలు స్త్రీలమెడలలో యజ్ఞోపవీత స్థానీయమగు మంగళసూత్రమును గట్టించుట కేమికతమో తెలియరాకున్నది. పురుషునిమెడలోని సూత్రము విగ్రహారాధకమైనచో స్త్రీమెడలోని సూత్రముమాత్రమెట్లు విగ్రహారాధకముగాదో బోధపడుటలేదు. పురుషునిమెడ సూత్రము లేకుండ నెట్లుండగూడదో స్త్రీమెడయును సూత్రములేకుండ నట్లుండఁగూడదు. ఇది హిందువులకుఁ బవిత్రసూత్రము. అట్లనే బ్రాహ్మూలకును నిది (స్త్రీలపట్లమాత్రము) పవిత్రసూత్రమును ప్రతిమయును నై యున్నదఁట ! వీరును "This auspicious string.” అని చెప్పుచున్నారు. ఇది యంధప్రాయముగా హిందువుల యాచారము ననుసరించుటకాదా ?
బంగారు పుస్తెను గట్టుట.
హిందువులు మంగళసూత్రమునందొక బంగారుపుస్తెను దగిలింతురు. అదిచూచి వీరును నొకపుస్తె నీసూత్రమునఁ దగిలించిరి. హిందువులు బంగారుపుస్తెను సూత్రమునఁ దగిలించుటకొక సాంప్రదాయము కలదు. పూర్వకాలమునంద పాలయను చిన్నది రోగపీడితురాలై వివాహముకాక భక్తితో నింద్రునారాధింపఁగా నాతఁడు కరుణించి యుగచ్ఛిద్రమందు సువర్ణమునుంచి దానిగుండ మంత్రోదకము నాపె తలపైఁజల్లి యాసువర్ణమును ధరింపఁజేసి యామెను సూ