462
ఉపన్యాసపయోనిధి.
ఈ దినములలో నవనాగరిక ఫక్కిక బంగారు బిళ్ళలను ముంజేతులకుఁ గట్టుకొనుట వాడుకయై యున్నది. ఆరీతిగా జేతికైనఁ గట్టింపక వీరీబంగారు నాణెమును సూత్ర బద్ధముచేసి మెడలోగట్టించుటకుఁ గారణమేమి? హిందువుల యాచారము మెడలోఁ గట్టుటగాన వీరును నటులాచరించిరి.
హిందువులందీ యాచారము కలుగుటకుఁ గారణ మేమన హిందూమతప్రకారముగా స్త్రీకివివాహ ముపనయనముగానున్నది. "స్త్రీణాముపనయస్థానేవివాహంమనురబ్రవీత్" అని వ్యాఘ్రపాదుఁడు చెప్పియున్నాఁడు.
"Marriage is to them the substitute for regeneration"
అనిమోనియరు విలియమ్సుదొరవారు వ్రాసియున్నారు.
స్త్రీకి వివాహమే యుపనయనము గాన వటువునకువలెనే వధువునకును వివాహకాలమున మౌంజీబంధనము నడుమునఁ జేసి యజ్ఞోపవీతస్థానీయముగా మెడలో మంగళసూత్రమును వేయింతురు. తెలిసినవారీ మంగళసూత్రమును నవతంతువులతోఁ గూర్తురు. వటువున కుపనయకాలమున నవతంతు ధారణము చేయుటవంటిదే వధువునకుఁ బరిణయకాలమున వేయు నవతంతుయుత మంగళసూత్రము. సన్యాసి యుపవీతమును విసర్జించినట్లె విధవసూత్రమువిసర్జించును. స్త్రీకి విధవాత్వము సన్యాసము. ఇఁకఁ బురుషుల మెడలందుండు