మొదటిబ్రాహ్మూవివాహము.
461
దూవివాహ ధర్మముననుసరించిరని తేలుచున్నది. మఱియును హిందువులు పాణిగ్రహణ సమయమునఁ జదువు మంత్రములనేజదివిరి. అవియేవియన:-"కామఃకామాయ కామోదాతాకామః ప్రతిగ్రహీతా కామగ్ం సముద్రమావిశమేనత్వాప్రతిగృహ్ణామి” Love gavo to love &c. వాక్యములీ మంత్రార్ధమునే యిచ్చుచున్నవి. దీనినిబట్టి వీరుదక్షిణ హస్తముతీసి కుడిచేయిపెట్టువారేకాని వేఱుకాదని తోచుచున్నది.
——:మంగళసూత్రధారణము:—
ఇందునుగూర్చి ఇండియను మెస్సెంజరు పత్రిక యిట్లుచెప్పుచున్నది;-
"The bridegrom tied the Mangalasutram a golden coin with the letters of Brahma Kripahi Kevalam to the bride's neck saying this auspicious string the symbol of my love. I tie to your neck, O prosperous one walk the path of virtue with me.
దీనినిబట్టి వరుఁడు మంగళసూత్రమును వధువు మెడలో "శ్లో॥ మాంగళ్య తంతునానేనమమజీవన హేతునా! కంఠెబధ్నామిసుభగేత్వం జీవశరదాంశతమ్" అని హిందువులు చదువు శ్లోకమునేచదివి కట్టినాఁడని తెలియవచ్చుచున్నది. This auspicous string eto” వాక్యములీశోక భావమునే యిచ్చుచున్నవి.