Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/487

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

460

ఉపన్యాసపయోనిధి.

ఏబ్రాహ్మూ వివాహ మయినను వీరీమంత్రమును జదువుదురా? అదిపొసఁగ నేరదుకదా? కానహిందువులయాచారమునే వీరంధ ప్రాయముగా ననుసరించిరని తేలుచున్నది. ఇదియే కాబోలు వీరు చేసిన ఘన సంస్కారము! పోలు! బోలు!!

పాణిగ్రహణము.

ఇందును గూర్చి ఇండియను మెస్సెంజ రిట్లు చెప్పుచున్నది.

“The bridegroom then touching the brides right hand said" Love gave to love, love is the giver, love the receiver with love I accept you, I accept you for the accomplishment of virtue and the acheivement of bappiness. I shall not leave you.”

ఇదియును వైదిక వివాహము ననుసరించియే యున్నది. వరుడువధువు కుడిచేయి పట్టుకొనెనట? కుడిచేయి యేల పట్టుకొనవలెను? యెడమచెయ్యి యేల పట్టుకొనరాదు? హిందువులకు వారి సూత్రకారులు కుడిచేయి పట్టుకొన వలెనని విధించియున్నారు "సూ॥ అధాస్యై దక్షిణేన నీచాస్తేన దక్షిణ ముత్తానగ్‌౦ హస్తగృహ్ణీయాత్" అనిసూత్రము. దీనినిబట్టి యీబ్రాహ్మూలును హిందూ సూత్రకారుల పద్ధతినే యనుసరించిరని తెలియవచ్చుచున్నది. అనఁగా సరిగాహిం