మొదటిబ్రాహ్మూవివాహము.
459
ధీమతే । ప్రయతోయంప్రయచ్ఛామిధర్మ కామార్ధసిద్ధయే॥' అని చదువుశ్లోకమునే వీరునుజదివి కన్యను వరునికిచ్చిరని స్పష్ట మగుచున్నది. పైననున్న "This girl adorned ect" అను వాక్యములీశ్లోకార్ధమునే యిచ్చుచున్నవి. వస్త్రాదికమును దానముచేసినట్లుగా కన్యనుగూడ దానముచేయుట యాయనియు కన్య వరునిబొందుటకుఁ దనకుఁదానే స్వతంత్రురాలనియుఁ జెప్పు వీరు హిందువులవలెనే కన్యాదానము నెట్లుచేసిరో తెలియకున్నది. ఇదిదానము కానియెడల సాలంకృత యైన యీకన్యను నేను నీకిచ్చుచున్నానని వీరెట్లుచెప్పిరో తెలియకున్నది. శాసనానుసారముగా వీరిపనియేదియన వధూవరులన్యోన్యమర్పించు కొనుచుండఁగాఁ దాముసాక్షిగా నుండుట.
(Whereas he simply witnesses the contract between the bride and bridegroom and listens to the words by which they bind themselves to matrimonial union)
తమమతాను సారముగా వధువు స్వతంత్రురాలై తనకుదానే వరున కర్పించు కొనవలెనుగదా! యిచట నీతఁడు నేనిచ్చు చున్నాననుటలో సారస్యమేమున్నది? హిందువులలో స్త్రీస్వతంత్రురాలు కాదు. కాన కన్యాదాతలు జనకాదులగుచున్నారు. ఇటవీరికి కన్యాదానము చేయుట కధికార మెక్కడిది. ఈపిల్లను దాము పెంచి యుండుటచే నిందొక వేళ ప్రత్యేకముగా దమకు సత్వముండినదనిన ననవచ్చును.