Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జీవన్మతమేది


ట్టుచున్నది. ఇదియును గ్రమక్రమముగా నశించుచున్నది. దీనికత్యల్పకాలములోనే యాయువునిండిపోయినది అవసా నదశ సమీపించినది. క్రీస్తుమతము జీవించినంత కాలముజీ వించు భాగ్యమైన దీనికిఁ బట్టలేదు.

బ్రహ్మసమాజమతమన కవసానకాలము సమీపించినద ని నేను చెప్పచున్నట్లు భ్రమింపవలదు. బ్రహ్మసమాజమునకు ప్రధానాచార్యులుగా నుండిన శ్రీవండిత శివనాధశాస్త్రిగా రేయట్లు చెప్పియున్నారు. ఈ నడుమ కలకత్తాపురమున జరి గినబ్రహ్మసమాజపు వార్షికోత్సవ సమయమున వండితశివ నాధశాస్త్రి గారే చదివినపత్రిక వలన నీవిషయమంతయుఁ దే లుచున్నది వీరీపత్రికలోఁ బ్రారంభమునం దువలె నిప్పుడు చదువుకొన్న వారెవరును బ్రహ్మసమాజములోఁ గలియుట లేదనియుఁ గలియకుండుటయేగాక దానినుండి విముఖులగు చున్నారనియు మున్ను తామువన్యాసముల నిచ్చుచువచ్చిన తావుల వినవచ్చుజనములో నిప్పుడాఱవపాలైన వచ్చుట లేదనియుఁ గడువిచారముతో సెలవిచ్చిరి. ఈ మతమిట్లు క్షీణదశనందుటకుఁ గల ముఖ్యకారణములఁ గూడ వారుచూ పియుండిరి. విగ్రహారాధనాదికము లేకపోవుట చేత సామా న్యజనులు బ్రహ్మసమాజము నవలంబించుట లేదని శివనా ధశాస్త్రిగారే నొక్కివక్కాణించి యున్నారు. తమసమా జస్థితింగూర్పి శివనాథశాస్త్రిగారు వ్రాసిన వాక్యములఁ గొ న్నింటి మీయెదుటఁ బెట్టుచున్నాఁడను:—