Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/469

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

442

ఉపన్యాసపయోనిధి.

జ్ఞానమునకై ప్రపంచమును విడుచు యతులు బహిరంగముగా యుద్ధరంగమున నిలచి యుద్ధముచేయు యోధులవంటివారు. బహిరంగముగా యుద్ధరంగమున నిలచి యుద్ధముచేయుటకంటె కోటలోనుండి యుద్ధముచేయుట క్షేమకరము.

ఇఁక బ్రహ్మసమాజికులు వ్రాసినది సత్యమెట్లుకాఁగలదు. సాధనచతుష్టయ సంపన్నులకేగాని బ్రహ్మజ్ఞానముగలుగదనియు సాధనచతుష్టయములలో నిహాముత్రఫలభోగవిరాగమొక్కటనియు వేదాంతగ్రంధములు భోధించుటలేదా యందు రేని అట్లుబోధించుచున్నమాటసత్యము. ఇహాముత్రఫలభోగ విరాగము కలవారికేగాని బ్రహ్మజ్ఞాన మలవడదనిన మాటయును సత్యము. జ్ఞానులైనవారలు ప్రపంచమునందు నంటియు నంటనియట్లుందురు గాని సంసారనిమగ్నులై యుండరు. ఇందునుగూర్చి రామకృష్ణపరమహంస యిట్లువ్రాసి యున్నాఁడు.

"(65) The wind carries the smell of the sandal wood as well as that of ordure, but does not mix with either. Similarly a perfect man lives in the world, but does not mix with it"


(వాయువు చందనవరీమళమును మఱియొక దుర్గంధమునుగూడ వహించును. కాని వీనిలో దేనితోడను గలసిపోదు.