బ్రహ్మసమాజమునందు విశేషముకలదా?
441
వేదాంతరహస్యములను విధియుక్తముగా నేర్చికొనెను. పిమ్మటనాతఁడు విశేషజ్ఞుఁడాయెను, తరువాత నతనికి జీవయాత్రనడుపుటలో వేదాంతము అధికారము చెల్లించుట యందైననుసరె యవమానమందైననుసరె యమితసాహాయ్యమునొసంగెను. మఱియునింగ్లీషువారి దృష్టిలోఁగూడ నీతఁడు దేశీయపరిజ్ఞాతలలోఁ బరమావధిగా నెంచఁబడు చుండెను)
ఇట్టి యుదాహరణము లనేకములు గలవు. గ్రంధవిస్తరభీతిచే నింతటితో విరమించు చున్నాఁడను. దీనినిబట్టియే బ్రాహ్మసామాజికులు వ్రాసినది తప్పని బుద్ధిమంతులకుఁ దోఁచక పోదని తలంచెదను.
రామకృష్ణ పరమహంసవాక్యములు.
మఱియును రామకృష్ణపరమహంస యేమిచెప్పుచున్నాఁడో గనుండు.
"(381) Those who live in the world and try to find salvation are like soldiers that fight protected by the breast-work of a fort, which the ascetics who renounce the world in search of a God are like soldiers fighting in the open field. To fight from within the fort is safer than to fight in the open field."
(ప్రపంచధర్మమందుండి ముక్తిని సంపాదింపఁగోరువారు కోటలోనుండి యుద్ధముచేయు యోధులవంటివారు. బ్రహ్మ