Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/464

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బ్రహ్మసమాజమునందు విశేషముకలదా?

437

బ్రహ్మజ్ఞానమును బోధించెఁగాన బ్రహ్మజ్ఞానమునకు గృహస్థులుకూడ నర్హులని తేలుచున్నదని వ్రాసియున్నారు. శ్రీ మాక్సుమూలరు దొరవారు సంసారులై యుండియు బ్రహ్మజ్ఞానమును సంపాదించినవారిని సాంసారికవ్యాపార నిమగ్నులైయుండియు బ్రహ్మజ్ఞానమును సంపాదింపవచ్చుననినవారినిగూడ, నెప్పటివారినోగాక, యిప్పటివారి నిచ్చియున్నారు. చదువరుల యుపయోగార్ధమై యాసంగతుల నిటనిచ్చుచున్నాఁడను.

రాయి సాలిగ్రామ సాహెబు బహదర్.

ఈ బ్రహ్మజ్ఞాని పశ్చిమోత్తర పరగణాలలో పోస్టుమేష్టరు జనరల్ పనిచేసిన గొప్పగృహస్థుఁడు ఈతఁడు చిన్నప్పటినుండియును వేదాంతమునం దిభిరుచి కలవాఁడు. ఈతఁడొకజ్ఞానికడ బ్రహ్మజ్ఞానోపదేశము నంది యాతనికి సదాదాస్యము చేయుచుండెడివాఁడు. ఈతఁడు వ్యాపారపరిత్యాగముచేయుదునని గురువుతోఁ జెప్పినప్పుడెల్ల గురువు వలదని వారించుచుండెడి వాఁడు. ఇందునుగూర్చి మాక్పుమూలరు దొరవారు వ్రాసినవాక్యము నీక్రింద నిచ్చుచున్నాఁడను.

"After some time the pupil wished to retire from the postal service, but the Saint would not allow it. When he was appointed Post Master General of the North-west he fell upon his knees before the Saint