Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/461

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

434

ఉపన్యాసపయోనిధి.

కు బద్ధుఁడై యుండవలయును. ఈయాచారవ్యవహారములు నిరుపయోగములు నసత్యములు నని యంగీకరింపఁబడెను గాని యైనను వీనినాచరింపవలెను. బ్రహ్మజ్ఞానము పేరుచెప్పి వీనిని విడువరాదు. అదియోగులకుమాత్రమే యుక్తము. ఇఁక బ్రహ్మసమాజము చేసినదేమనగా నడవుల నుండియు తాళీదళసంపుటప్రకరకాంతారముల నుండియు నీబ్రహ్మజ్ఞానమును దీసికొనివచ్చి ప్రతిమానవునకును ప్రతిమాన వతికిని నిత్యసంసారికకృత్యములందే దీనిని లభ్యముచేయుట.)

పైదానినిబట్టి భగవంతుని గూర్చియు మనుష్యాత్మను గూర్చియుఁ బ్రపంచమును గూర్చియు హిందువులు తెలిసికొనినంత మఱియెవరును దెలిసికొనియుండలేదని బ్రాహ్మసామాజికుల యభిప్రాయమైనట్లుగా స్పష్టమగుచున్నది కదా. ఇఁక వీరు సరిక్రొత్తమతమును గలిపించుకొననేల యన దానికిఁ గారణమును వీరిట్లు చెప్పియున్నారు. అదియేదియన హిందూమతము ప్రపంచములో నితరులెవ్వరును గనిపెట్టని బ్రహ్మజ్ఞానమును బోధించినను అది యతులకుమాత్రమే సాధ్యమనియు దానినిసంపాదించుకొనుటకు నడవులకుఁ బోవక తప్పదనియు బోధించుచున్నదంట ! ఇఁక తమబ్రహ్మసమాజమనిననో ప్రతిగృహమునకు స్త్రీపురుషుల కెల్లరుకును నతిసులభ సాధ్యముచేసి వేయుచున్నదంట! ఇందులో హిందూ