430
ఉపన్యాసపయోనిధి.
లపరాక్రమములచే వశపఱచుకొనిన దేశములకెల్ల క్రైస్తవమతబోధకులు పోయి తమజాతులకుఁ గలిగిన యీఘనత యంతయుఁ దమక్రైస్తవమతము మూలముగాఁ గలిగినదని బోధించుచుందురు. మతమునకును నైహికోన్నతికిని నంతగా సంబంధము లేకున్నను ప్రమాదవశమున ప్రథమమున బుద్థిమంతులు కూడఁ గొందఱీబోధను వినిమోసపోయి తద్వికారము నందుచుండిరి. అట్టిబోధకు వశమగువారు మనదేశములో హూణవిద్యను జదువుకొనినవారిలోఁ గొందఱు కలరు. వారిచే స్థాపింపఁబడినది బ్రహ్మసమాజమతము. వీరు క్రీస్తుమతపద్ధతుల ననుసరించి తమమతము నేర్పాటుచేసికొనిరి. మొన్న పండిత శివనాధశాస్త్రులవారు సెలవిచ్చినట్లుగా 'మేము క్రీస్తుననుసరించువారమనియు హిందువులముకా' మనియు చెప్పుకొనువారు పలువురువీరిలోబయలువెడలిరి. లోకానుభవము కలిగినకొలఁది మతవిషయమునందుఁబ్రవేశమును సంపాదించినకొలఁది మరల నీబ్రాహ్మసామాజికులు క్రమక్రమముగాఁగ్రీస్తుమతమార్గమునుండి మరలి హిందూమత పద్ధతినే యనుసరించుచున్నారు. ఇందులకు దివ్యజ్ఞాన సమాజమువారు శ్రీ పరమహంస రామకృష్ణ మఠమువారును హిందూమతమునంగల విశేషముల లోకమునకు వ్యక్తపఱచుటచేఁ గలిగిన మార్పు ముఖ్య కారణము. ఈ మార్పు పశ్చమ దేశములందె కలుగుచున్నది. అందుమూల