పుట:Upanyaasapayoonidhi (1911).pdf/456

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కాన హిందూమత విరుద్ధమగు తొల్లింటివిదేశీయ బ్రహ్మసమాజము నశించి తత్సామాజికులలో హిందూమతము నామాంతరముతో బ్రవేశించు చున్నదని చెప్పుకొనవచ్చును.

    ఈనడుమ మాపురమ్నకు విచ్చేసిన ప్రార్ధనాసమాజమందిరములో బ్రహ్మసమాజ మతసారములగూర్చి ముచ్చటించిన బ్రదౌ గోటేటి కనకరాజు బి.ఏ, గారు సీతానాధతత్వభూషణులవారి పుస్తకమును జదువుకొందురుగాక. కనకరాజుగారద్వైతముకంటె బ్రహ్మసమాజము భిన్నమనియు ప్రార్ధన ప్రధానము గాగలదనియు నుడివియున్నారు.  వీరి వాదమును శ్రీసీతానాధతత్త్వభూషణుల వారి గ్రంధములే పూర్వపక్షముచేయుచున్నవి.
                                         *

బ్రహ్మసమాజమునందువిశషముకలదా?

   ఇక్కాలమున క్రైస్తవులగుపాశ్చాత్యుల బలపరాక్రమములును విద్యావివేక ములును మిగుల నున్నతస్థితినంది లోకమున కబ్బురము గలిగించుచున్నవి. పాశ్చాత్యులు తమబ