428
ఉపన్యాసపయోనిధి.
కాని పూర్వాపరజ్ఞానములేని జనసామాన్యముంగూర్చి గాని పైకిచదువుకొనిన వారివలె కాన్పించుచు మతవిషయమైనట్టి గాని వేదాంతవిషయకము లగునట్టిగాని యంశములందును బ్రహ్మజిజ్ఞాసా విషయమునంగాని పనిపూని శ్రద్ధవహింపనివానింగూర్చిగాని నేనుముచ్చటించుటలేదు. బ్రాహ్మసామాజికులలో మూఁడువంతులు బ్రహ్మజిజ్ఞాసలేదని నేనంగీకరింతు గాని అదిగల బుద్ధిమంతులలో తప్పక యుక్తిప్రధానమైన అద్వైతము వ్యాపించుచున్నది. మిగిలిన వారిలో ప్రాఁతయవిచారపూర్వద్వైతమే నిలచియున్నది. ఈప్రాఁతపద్ధతి వారలు దినదినాభివృద్ధినందుచున్న యీక్రొత్తమతముపై తెలియని విమర్శలఁ గావించుచుందురు.)
కావున నిర్మలసత్యజ్ఞానహీనులై వట్టిమాటల మూటలైన పండితమానులింకను ప్రాఁతమతమునే బట్టుకొని వ్రేలాఁడుచు నర్ధశూన్యములైన ధర్మోపదేశములతో కాలముపుచ్చుచున్నారు. జ్ఞానులెల్లరు సారవంతమైన యద్వైతమతమునకు వచ్చుచున్నారు. కొందఱు కృష్ణలీలలఁ బాడుచు భక్తిప్రపత్తిని జూపుచున్నారు. మఱికొందఱు హోమాదులను జేయుచు కర్మకులగుచున్నారు. ఇంకకొందఱు జీవేశ్వరులకు నభేదము గనిపెట్టి జ్ఞాన ప్రధాను లగుచున్నారు. వేఱొకకొందఱు విగ్రహతత్త్వము గ్రహించి యవి జ్ఞానదాయకములని బోధించుచున్నారు.