Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/453

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

426

ఉపన్యాసపయోనిధి.

ఈరీతిగా నద్వైతమతము బ్రహ్మసమాజములో వ్యాపించుచుండుట నొకఘనతగా సీతానాథ తత్త్వభూషణుల వారీక్రింద వాక్యములలో వ్రాయించియున్నారు.

"To me it is the most tangible proof of the growth of the Brahma Samaj from childhood to maturity.”

బ్రహ్మసమాజము బాల్యమునుండి యౌవనదశకు వచ్చినదని చెప్పుటకిది ప్రకటమైన నిదర్శనముగా నాకుఁ గాన్పించుచున్నది.)

మొదట దేనినిత్రోసివేయుటకై యీబ్రాహ్మసామాజికులు ప్రయత్నించిరో యదియే తుదకు వీరికి శరణమగుచున్నది. బ్రహ్మసమాజమతములోని వృద్ధఘటములనుగూర్చి తత్త్వభూషణులవా రిట్లువ్రాసియున్నారు.

"I have seen Brahmas of long standing and of recognized Spiritual eminence losing hold of their most cherished beliefs in the course of an hour or so when the frail basis on which they stood has been clearly shown to them."

(బహుకాలమునుండి బ్రాహ్మ సామాజికులైయుండి యెన్నఁదగిన యాత్మజ్ఞానము కలవారెల్లరును నొకటిరెండు గంటలు ప్రసంగించి చూచినంతన తామెంతనశ్వరమైన యాధారము కలిగియున్నారో తెలిసిన తరువాత తామెంతయో