బ్రహ్మసమాజమత పరిణామము.
425
"I need hardly add that the tendency to Monism is even more distinct and pronounced in Babu Nagendra Nath Chatterji's works than in those of Pandit Sastri. In the second volume of his Dharmajijnasa he clearly recognises the truth of Idealism and in the third volume of the same book in his lecture on Analmavader Ayauktikata he admits the essential unity of the universal and the individual soul,"
(పండితశివనాధశాస్త్రి వ్రాతలకంటె బాబునగేంద్రనాధచటర్జిగారి వ్రాతలందు అద్వైతమతాభిముఖత హెచ్చుగాఁ గాన్పించుచున్నదని నేను వేఱుగఁ జెప్పనక్కఱలేదు. ఛటర్‌జిగారు వ్రాసిన 'ధర్మజిజ్ఞాస, అనుగ్రంథములో రెండవ సంపుటములో నీఁతడు స్పష్టముగా నద్వైతవాదము నంగీకరించినాఁడు. మఱియును మూఁడవ సంపుటములో 'అనాత్మవాదాయుక్తికత' అనువ్యాసములో జీవాత్మయు పరమాత్మయు నొక్కటియని యంగీకరించియున్నాఁడు)
(3) మూఁడవఋజువు బాబుహీరలాల్ హల్ గారు మున్నగువారు వ్రాసిన గ్రంధములఁట.
ఈపైకారణములనుబట్టి మొదటి బ్రహ్మసమాజము పోయి క్రమక్రమముగా అద్వైతమతము దానితావున వ్యాపించినట్లు తెలియవచ్చుచున్నది.