Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/451

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

424

ఉపన్యాసపయోనిధి.

ను వీరువ్రాసిన ధర్మవిజయ సంగ్రహములలో మొదటిభాగములలో వీరు 'మనుష్యాత్మ పరమాత్మలో నొకభాగము' అని చేసినబోధయును వీ రద్వైతవాదప్రవణులై యున్నారని నిశ్శంకముగాఁ దెలియవచ్చుచున్నది.)

దీనివలన శివనాధశాస్త్రులవారు భగవంతునికంటె సత్యపదార్ధము వేఱొండులేదని వాదించుచున్నారను మాట స్పష్టమగుచున్నది. ఇంతకంటె వేఱుగా నద్వైతముకలదా ? ఇదికేవలాద్వైతమేకద. అద్వైతమతసారమును మన పెద్దలు శ్లోకార్ధములోనిట్లు తెల్పియున్నారు.


"శ్లో॥ శ్లోకార్ధేన ప్రవక్ష్యామియదుక్తంగ్రంధకోటిభిః
    బ్రహ్మసత్యంజగన్మిధ్యాజీవో బ్రహ్మైవనాపరః॥"


శివనాధశాస్త్రులవారు చెప్పినదియు నిదియే. వీరు బ్రహ్మకంటెసత్యపదార్ధము వేఱొండు లేదనిరి. అనఁగా బ్రహ్మసత్యము జగన్మిధ్యయనిరనుటయెకదా. వీరుమనుష్యాత్మ పరమాత్మలోనొకభాగమేయనిరి. అనఁగా జీవుఁడు బ్రహ్మమే వేఱొండు కాదనుటయేకదా.


(2) సాధారణ బ్రహ్మసామాజమతమద్వైతమతబోధలోనికి దిగుచున్నదనుటకు రెండవ ఋజువేదన బాబునగేంద్రనాధచటర్ జీగారి గ్రంథము లని సీతానాధతత్త్వభూషణులవారు వ్రాయించియున్నారు. ఇందుగూర్చి తత్త్వభూషణులవారిట్లు వాయించియున్నారు:-