Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/449

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

422

ఉపన్యాసపయోనిధి.

Brahmananda into an argumentative form of Theism with a distinot tendency to Monism. "

(మహర్షిదేవేంద్రనాధులయొక్కయు బ్రహ్మానందులవారియొక్కయు అవిచారపూర్వోపలబ్ధ పురాతన ద్వైతాస్తిక మతమునుండి విస్పష్టముగా నద్వైతవాదమును జేయుచున్న యుక్తిప్రధాన రూపాస్తికమతముగా బ్రహ్మసమాజము మాఱుచున్న దనుటకు లోపములేదు)

"The old dualism of God and the world, and God and man, as distinct realities, the dualism on which the old form of Brahmaism insisted in various shapes, is, in a manner, dead and has given place to a doctrine of unity in difference."

(దేవుఁడునుప్రపంచమును, మనుజుండును దేవుండును వేఱువేఱు సత్యములని బోధించునట్టియుఁబురాతన బ్రహ్మసమాజమునకుఁ బలువిథముల మూలాధార మగునట్టియు ప్రాతద్వైతమతము, ఒకవిధముగా వచ్చినది. దానితావున భిన్నతలో నేకత్వము ప్రవేశించినది.)

అద్వైతమతము వైపునకు బ్రహ్మసమాజము మరలిన దనుటకు మూఁడువిధములగు ఋజువులు కలవని సీతానాథతత్త్వభూషణులవారు వ్రాయించియున్నారు.