Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/443

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

416

ఉపన్యాసపయోనిధి.

బ్రాహ్మణులనుగూర్చి వీరికిగలయభిప్రాయము.

రామమోహనరాయలవారికి బ్రాహ్మణులు వేదసంరక్షణార్థమై పరమేశ్వరునిచే సృజింపఁబడిరనియు వారేవేదములను బఠింపవలెననియుఁ దలంపుగలదు. ఇందునుగూర్చి మోనియరువిలియమ్సు దొరవారిట్లు వ్రాసిరి.

"At the same time, he never quite abandoned the idea of an order of men ordained by God to be special teachers of divine truth. It is said that the meeting house of the Samaj had a private room open only to Brachmans, where special readings of the Vada were conducted by them.

ఇట్లనుటచే వీరు స్త్రీశూద్రులు జ్ఞానార్హులు కారని తలంచిరని యెన్నఁగూడదు. అందఱికిని వేదాంతజ్ఞానమవ సరమని వీరితలంపు.

ఈతని సంస్కారమెట్టిది?

రామమోహనరాయలవారు కొన్నివిషయములలో సంస్కారముల పెట్టినమాట నిజము. సహగమనమును మాన్పించినవారువీరే. విగ్రహారాధనముపై దండెత్తినవారువీరే. కాని వీరేసంస్కారములను బెట్టిననుశాస్త్రములఁ బరిశీలించి వాని క్రమముననుసరించుతలంపు కలవారై సౌహార్దముతోఁ గూడుకొనినరీతిని నెమ్మదిగాఁ గలిగింపనెంచిరి. ఇందునుగూర్చి మోనియరువిలియమ్సు దొరవారిట్లు వ్రాసిరి.