Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/442

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామమోహనరాయలవారు.

415

కలదు. "He exemplified in his life that Jnan (true wisdom) and Bhakti (love of God) went together" (భక్తిజ్ఞానములు రెండింటికిని నీతని జీవితము గుఱియైనది.) అని జోగేంద్ర చంద్రఘోషుగారువ్రాసిరి.

ఇక్కాలమున హిందూమత విరుద్ధమతమును గల్పించుకొనిన బ్రాహ్మసామాజికులీతనిని తమమతమునకు మూలపురుషునిగా నెంచికొనుచున్నారుగాని యది వట్టిభ్రమ. ఈతనికి బ్రహ్మసమాజమువంటి కొత్తవిపరీతమతమును గల్పించుట యందిచ్చలేనేలేదు. ఇందునుగూర్చి మోనియరు విలియమ్సుదొరవారిట్లు వ్రాసియున్నారు.

"He was careful to make the members of the new society understand that he had no idea of founding a new sect or new system, or even a new Church in the ordinary sense of the word.

̺

వేదములందు వీరికిఁగల యభిమానము.

వీరికి వేదములందు మిక్కిలి ప్రమాణబుద్ధికలదు. వేదములు దైవదత్తములని వీరి యభిప్రాయము. వేదములు దైవదత్తములుకాన నిర్దుష్టములని రామమోహన రాయలవారును నయ్యవి నిర్దుష్టములు కావున దైవదత్తములని దేవేంద్రనాధఠాకురుగారును దలంచిరి. అని మాక్సుమూలరు దొరవారు వ్రాసియున్నారు. వీరు వేదపఠనమునకై వేదమందిరము నొకదానిని స్థాపించిరి.