Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/441

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

414

ఉపన్యాసపయోనిధి.

రాయలవారు తీసికొనిపోయిరి ! ఇంతకంటె నెక్కుడు ఛాందసులుండఁగలరా?

ఈతఁడు కేనోపనిషత్తును భాషాంతరీకరించి దాని పీఠికలో జాతినిగూర్చి యిట్లు వ్రాసియుండెను.

"The chief part of the theory and practice of Hindooism, I am sorry to say, is made to consist in the adoption of a peculiar mode of diet, the last aberration from which is punished exclusion from his family and friends. Murder, theft, or perjury, though brought home to the part by a judicial sentence, so far from inducing loss of caste, is visited with no peculiar mark of infamy."

దీనినిబట్టి జాతికి వన్నె పెట్టుటకై శీలముకూడ నుండవలెనని వీరి తలంపుకాని జాతినేత్యజింపవలెనని వీరి భావము కాదు.

వీరివేదాంతమెట్టిది.

వీరివేదాంతము అద్వైతముతో సంబంధించినదై యున్నది. ఇందునుగూర్చి మోనియరువిలియమ్సుదొరవారె యిట్లువ్రాసిరి:-

"The alleged purity of his monotheism was liable to be adulterated with pantheistic idias."

మొత్తముమీఁదవీరిని విశిష్టాద్వైతులనుట కడుసమంజనము. వీరికిభక్తిజ్ఞానములు రెండింటియందుగూడ విశ్వాసము