Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/440

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామమోహనరాయలవారు.

413

(ఈయనమరణము ఇంగ్లాండులోని బ్రష్టల్ పురమున 1833 సం॥ సెప్టెంబరు 27 తేదీని సంభవించినది. బాహ్యాచార విషయములలో నీతఁడు హిందువుగానే గతించినాఁడు. ఈతని బ్రాహ్మణభృత్యుఁడు తనయజమానుని కులాచారానుసారముగా నితని ఉత్తరక్రియలు జరిపినాఁడు. ప్రాణప్రయాణ సమయమునందీతని దేహమునఁ జుట్టఁబడి జందెము పొడగట్టుచునేయున్నది. ఈతఁడు బ్రాహ్మణ విరోధమెంత చూపినను దుదివఱకును బ్రాహ్మణుఁడుగానే యుండినాఁడు.)

ఈతఁడు బ్రాహ్మణతావిరోధియనిన కులమక్కఱలేదనియు గోత్రమవసరములేదనియునుఁ దలంచినవానినిగా భావింపఁగూడదు. ఈతఁడు తనజాతిపోవునను భయముననే గద యింగ్లాండునకుఁ దనతోఁగూడ బ్రాహ్మణునివెంటబెట్టుకొనిచనినాఁడు. ఇంగ్లాండునందలి వంటల కలవాటుకలవాఁడుకాడుగాన బ్రాహ్మణుని గూడఁదీసికొనిపోయినాఁడేకాని కులముపోవునను భయమునఁ గాదందురేని ఈదేశమునుండి రామమోహనరాయలువారు గోవులనుగూడ సీమకుఁ దీసికొనిపోయియుండిరి. ఇంగ్లాండులో ఆవులులేవా ? వానిపాలు వీనిపాలవలె రుచికలిగియుండవా? మ్లేచ్ఛులకడనున్న గోవులపాలు త్రాగఁగూడదను తలంపుండుట చేతనేగదా వ్యయప్రయాసలకోర్చి యిక్కడినుండి గోవులనుగూడ