Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జీవన్మతమేది

21

సంకుచిత మార్గము కలవై యున్నవి. క్రీస్తుమతముంగూర్చి మాక్సుమూలరు దొరవారే యిట్లువ్రాయించి యున్నారు. "it was because attempts were made from very early times to narrow and stiffen the outward signs and expressions of our faith to put narrow dogma in the place of trust and love. That the Christian Church has often lost those who might have been its best defenders and that the religion of Church has almost ceased to be what before all things, it was meant to be a religion world-wide love and charity"

(మన మతాబాహ్య చిహ్నములను సంకుచితములును గ ఠినములు జేయుటకైయును భక్తివిశ్వాసముల స్థానమున సంకుచిత ధర్మములను బెట్టుటకును మొదటినుండియును బ్ర యత్నింప బడియుండుటచేత క్రీషుమతమునుండిదాని యు త్తమసంరక్షకులుగా నుండదగినవారు కూడ విముఖులై నారు. క్రీస్తుమతము మొదటఁ దలచినరీతిగా ప్రేమాస్పద మును ధర్మనిలయమునై జగదేకమతము గాక క్షీణీంచినది.)

శాటర్ డేరెవ్యూ (The Saturday Review) అనుపత్రిక క్రీస్తుమతమును గూర్చి యిట్లువ్రాయుచున్నది--

"In the presence of the scientific religious Brah manism, Buddhism, Judaism and Muhammadanism it has signally failed, and there is no prospect of an eventual victory."