Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/437

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

410

ఉపన్యాసపయోనిధి.

చుచున్నారు. మీరు కాలోచిత సంస్కారములకు లోఁబడక మూర్ఖులై ఈ పరిణామకాలమున౦దు ఉపేక్షాపరులైయుందురేని మీరును మీమతమును కొంతకాలములో నంతరించిపోవుదురు. ఇదిప్రకృతి సిద్ధమైన సత్యము; నమ్ముడు ముమ్మాటికినినమ్ముడు; జాగ్రత! జాగ్రత!

సర్వేజనాస్సుఖినోభవంతు.

'ఆంథ్రకేసరి.'

ఆ 1907 సం॥రము సెప్టెంబరు నెల శ్రీరాజా రామమోహనరాయలవారి జన్మదినోత్సవములచే వాసిఁగాంచినది కాన నీఘనునిఁగూర్చి యొకింత యిప్పుడు ముచ్చటించుకొనుట కడు సమంచితమై యుండును.

రామమోహనరాయలవారు బ్రాహ్మణోత్తములగు రమాకాంతరావుగారనువారి పుత్రులు. తల్లిగారిపేరు తారణిదేవి. వీరు మూర్షడాబాదు జిల్లాలోని రాధానగరమునందు 1774 క్రీస్తుశక వత్సరమున మేనెలలో జన్మించిరి. రమాకాంతరావుగారు మొగలాయి చక్రవర్తులకడ నుద్యోగములు చేసినవారగుటచే రామమోహనరాయలవారు చిన్నతనమునుండియు పారసి అరబ్బి మొదలగు తురకభాషల నభ్యసించిరి. వీరితండ్రిగారు విష్ణుభక్తులగుటచే వీరు భాగవతాది సంస్కృతగ్రంధములను గూడ బాగుగాఁ జదువుకొని వీరు సహజముగా మతాభినివేశము కలవారగుటచే తురుష్క భాషల నేర్చినప్పుడే యాభాషలందలి మతగ్రంథములగు ఖొరాను మొదలగువానిని గూడ చూచియుండిరి. మొదటినుండి