Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/436

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామమోహనరాయలవారు.

409

ఇంతింతనరాని మహోపకారమును జేసినవాఁడు. స్త్రీలదుస్థితిని నివారింపఁ జేయుటకై ప్రామాణిక గ్రంధములనుండి దృష్టాంతములనుజూపుచు హిందువులలో నున్నతాభిప్రాయములు పుట్టునటులఁజేసెను. రాజ నీతియొక్క మూలదుంపకు అనఁగా మన గమ్యస్థానమును మొట్టమొదట సూచించినవాఁ డీ మహానుభావుఁడేయని బహుజనులెఱుంగరు. అధికారుల ఆవరణమే మహాఘనముగ నెంచుకొనియిప్పటి సంస్కర్తలవలె ఆత్మగౌరవమును విడిచి స్వార్ధపరుఁడై స్వధర్మమును మరచివర్తింపలేదు. అంతరాత్మ బోధ మనునది మన యిప్పటి సంస్కర్తలకు సంఘమతసంస్కార కార్యములయందే గన్పట్టును గాని రాజ్యాంగ విషయములందు గన్పట్టదు. ఈరామమోహనరాయలకో సమస్తవిషయములయందు గన్పట్టును. సమస్తవిధములచేతను మనకీతఁడు మార్గదర్శియగు చున్నాఁడు. హిందూమతము శత్రువులచే నలుప్రక్కల ముట్టడింపఁబడిదురవస్థపొందుకాలమున ఈరామమోహనుఁడు పెట్టనికోటగానుండి సంరక్షింపఁగలిగినవాఁడు. తూర్పున రామమోహనరాయలును, పశ్చమోత్తరంబున దయానంద సరస్వతీ స్వామియు, ఇటీవల వివేకానందస్వామి మొదలగువారును తలయెత్తియడ్డుపడకుండినయెడల ఆంగ్లేయభాషాక్రాంతమైన హిందువిద్యాధిక ప్రపంచము పందొమ్మిదవ శతాబ్దమునందు క్రైస్తవమత భూయిష్ఠమయి పోయియుండును. కాఁబట్టి హిందువులెల్లరును రామమోహనరాయలకుఁ గృతజ్ఞత చూపవలసినవారగుచున్నారు. ఆచంద్రతారార్కముగ ప్రతిసంవత్సర మీదేశభక్తుని జయంతి మహోత్సవమును హిందువులాచరించుచు కీర్తినీయులగుదురుగాక !

ఈసందర్భమున పూర్వాచార పరాయణులకు అందు ముఖ్యముగాబ్రాహ్మణులకు మేముచేయు విజ్ఞాపన మేమనఁగా ఆర్యులారా ! మనదేశమునకు శత్రువులయినవారు హిందూజాతులలోని తరగతులలో ఎక్కువతక్కువ భేదములు కల్పించి మతవైషమ్యములు పెంపుచేసి లాభమునుబొందఁబ్రయత్నిం