రామమోహనరాయలవారు.
407
తస్వదేశమన్నను, స్వమత మన్నను, స్వధర్మ మన్నను విశ్వాసము లేనివారయి, పరధర్మమునకు బానిసీండ్రయ్యును దానికినిదూరగులై విశ్వామిత్రకల్పితంబైన త్రిశంకుస్వర్గమునుబోలె నడుమఁ దలక్రిందుగా వ్రాలాడుచు హిందూస్థానములో హిందూమత మనుపేరు లేకుండఁ జేయవలెనను దురూహతో మహాతపశాలులవలె మంత్రపఠనము చేయుచున్నారు. ఇటువంటివారు గాక రామమోహనరాయలు హిందూమతముయొక్క యున్నతికైకృషిచేసినవాఁడు. సంస్కృతభాషాపాండిత్యమునం దఖండు డగుటవలన నుపనిషత్తుల నెల్ల నభ్యసించి వానిని దేశభాషలోనికిని ఆంగ్లేయభాషలోనికిని భాషాంతరీకరించి వన్నెకెక్కెను. ఇతఁడు హిందూమతద్వేషి కాకపోవుటచేతనే బ్రాహ్మసామాజికులే గాక విద్యాధికులయిన హిందువులనేకులు సాంవత్సరికోత్సవముల యందు వీరు మనదేశమునకుఁ జేసిన యుపకార కార్యములనుగూర్చి బహుభంగుల శ్లాఘించు చున్నారు. నేఁడు వీరి సాంవత్సరికోత్సవ దినమగుటవలన వీరిజ్ఞాపకార్ధముగ మాపత్రికయందు వీరి యుత్తమ చారిత్రమును ప్రశంసించుచున్నారము. వీరు మతసంస్కారకార్యము లాచరించునపుడు వేదములనుండియు, హిందూమతగ్రంధములనుండియు బ్రమాణములను జూపకయేపనియు చేసియుండలేదు. వీరుహిందూవేదాంత మతమునం దభిమానముగలవారై పరమతములను ద్వేషింపక ఆయామతములలోని సత్యసారమును గూడగ్రహించుచు వచ్చిరి. కాని వీరెప్పుడును స్వమతగ్రంథముల నిరాకరింపలేదు. స్వదేశవేషభాషాదుల మరువలేదు. వీరుసీమకు బోయినప్పుడు సహితము తమదేశీయ పద్ధతులను విడనాడలేదు. ఇక్కడనుండి రెండుఆవులను, వంట బ్రాహ్మణునిగూడఁ గొనిపోయెను. యజ్ఞోపవీతమును సహితము విడిచిపెట్టలేదు. ఎందుచేతననగా తలలు బోడులు చేసికొన్నంతమాత్రమునఁ దలపులు పోఁజాలవనియును, జందెములు త్రెంపుకొన్నంతమాత్రముచేత రాగద్వేషాదులు పోఁజాలవవియును ఆయనకుఁ జక్కగాఁ దెలియును. జాతిద్వేష