Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/427

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

400

ఉపన్యాసపయోనిధి.

లన మానవమాత్రు లెల్లరు నిరాకారుఁడగు భగవంతునికి నాకారమును నారోపింపక యుండలేరని బోథలోనికి వచ్చుచున్నది.

మహర్షి దేమేంద్రనాధఠాకూరువారు.

ఈమహర్షిగారి తండ్రిగారు మిక్కలి శివపూజా ధురంథరులు. ఒకశివరాత్రినాఁడు బాలకుఁడైయున్న తమ పుత్రకుని వెంటఁబెట్టుకొని శివాలయమునకు బోయి లింగసన్నిధానముననుండి జాగరణము చేయుచుండిరఁట. నాటిరాత్రిజాగరణమునకై వచ్చిన భక్తులుచాలగలరు. అప్పటికి బాలకులైయున్న దేవేంద్రనాధులవారికిని జాగరణములందును విగ్రహములందును భక్తిచాలాకలదు. కొంతరాత్రి యగువఱకు జాగరణము చేయుచున్న భక్తులెల్లరుఁ గనుమూసి కునుకఁజొచ్చిరి. ఒక్క దేవేంద్రనాధులవారు మాత్రము నిదురలేక శివలింగమునందు దృష్టినుంచిచూచుచుండిరి. ఇంతలోనొక్క యెలుకపిల్ల మెల్లగాలింగముపైకెక్కి యందుభక్తులచేనర్పింపఁ బడియున్న యక్షతలఁ దినఁజొచ్చినది. ఆయెలుక తనపైకెక్కినను దేవుఁడు దానిని తొలగించుకొనలేకపోయెను. అది చూడఁగా నీమహర్షిగారికి దివ్యజ్ఞాన మొకటి కలిగినదఁట! అదియేదియనఁ 'దనదేహముపైకెక్కిన యెలుకపిల్లనైనతోలుకొన సామర్ధ్యములేని యీదేవుఁడు లోకము నెట్లురక్షింపఁగలఁడు? ఈవిగ్రహమునందు దైవమేయున్నయెడల ఈమాత్రపుసామర్ధ్యము కలిగియుండఁడా? కాననిందు దైవ