బ్రాహ్మసామాజికులు - విగ్రహారాధనము.
399
మందురా? అట్లయిన కరచరణాదులు వాస్తవముగా లేకుండినను నలంకారార్థమై భగవంతుని ముఖమనియు నీశ్వరుని కరములనియు వాడుటవలని ప్రయోజనమేమి? అసత్యమైన యలంకారమును వాడనేల చదువరులకు నలంకారయుక్తముగాఁ జెప్పిన బాగుగా మనసునునాఁటును గాననట్లు చెప్పితిమందురా? అట్లయిన వేఱుమాటలతో మీరుచెప్పినదాని కర్ధమేమగుననఁగా లోకులుకరచరణాదులు లేనివానినిగూర్చి ముచ్చటించునప్పుడుకూడ ఉన్నట్లు వర్ణించిన బాగుగా గ్రహించి మనసునందుఁ బట్టించుకొనఁ గలుగుదురుగాన నిట్లు చెప్పితిమని యర్థమగును. అది సత్యమే. అలంకారములు చెప్పఁబోవునంశమును దృఢపరచుటకే యక్కరకు వచ్చును. బ్రాహ్మసామాజికు లలంకారార్థముగా నెట్లు దైవమునకు ముఖాదులున్నట్లు వర్ణించుచున్నారో యట్లే హిందువులు అలంకారార్ధమయియే భగవంతునికిఁ గరచరణాదు లుంచుచున్నారు. "ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణొరూపకల్పన"మ్మని వీరుచెప్పియున్నారు. అనఁగా నలంకారార్థమై (జనులకు బాగుగా దైవమహిమ బోథలోనికి వచ్చుటకై) నిరాకారుఁడగు భగవంతునికి గరచరణా ద్యాకారములు గల్పించుచున్నాము అని చెప్పియున్నారు. 'హస్తము' అనుపదమును అను సంజ్ఞయును నొక్కటియే భావము నిచ్చునుగదా. కాన 'హస్త' మనుపదమును వాడువారును అను సంజ్ఞను వాడువారును దుదకు నొక్కటి కారా? దీనివ