398
ఉపన్యాసపయోనిధి.
గవంతుని రూపములేని యాత్మపదార్థముగాఁ దలంచుట ! అది కలలోనివార్తకాదా ! భగంవతునికి రూపములేదని పలుమాఱువ్రాయుచు వచ్చిన వీరిగ్రంధములందుఁగల యీవ్రాతవైఖరింగనుఁడు:-
“దైవముఖమును జూచి సత్యము పలుకుచో జంకనేల?” (సంపుటము 8 పుట 288)
“జడియక దైవముఖమును జూచి పనిచేయువాఁడు" (సంపుటము 8 పుట 35)
దేవునిముఖమునుజూచి నిశ్శంకముగా సత్యమును బోధింపవలయును" (సంపుటము 8 వుట 384)
"కనుక దైవముఖమును జూచి యసత్యముతోఁ బోరాడువాడు (సంపుటము 8 పుట 384)
మున్నగు తావులందు దైవమున కొకముఖమున్నట్లురావుబహద్దరుగారు వర్ణించియున్నారు. మఱియును వండితశివనాధశాస్త్రిగారు ‘With the hand of God' (భగవంతుని చేతితో) అని వ్రాయించియున్నారు. ముఖము, హస్తములు చరణములును భగవంతునికిలేవుగదా ! వీరిట్లు భగవంతుని ముఖములనియు, కరములనియుఁ, జరణములనియునుడువనేల? ఇది విగ్రహములేనిభగవంతుని విగ్రహముగలవానినిగా భావించుట కాదా ! మేము నిజముగా దైవమునకు ముఖమును గరచరణాదులును గలవను తలంపున నట్లు వాడియుండలేదు. ఊరక యలంకారముగ నట్లు మాటలాడితి