394
ఉపన్యాసపయోనిధి.
నట్లుతెలుపఁబడియున్నది. అటుపిమ్మట శ్రీ పంతులవారి సంపుటములు వెలువడినవి. అందునునిది కానవచ్చుచున్నది. ఇదిమారుపేరు పెట్టుకొనుటకాదా?
కాన మాబ్రాహ్మసామాజికపు సోదరులు పరులపరిహసింపఁబోవునప్పుడు తమమతముయొక్కయు తమమతోద్ధారకులయొక్కయు స్థితిగతులెట్టివో ముందాలోచించి చూచుకొని మాటలాడుచుందురుగాక.
నలుని నిత్యసత్యవ్రతముయొక్క మహిమను పరీక్షించుటకే యింద్రాదు లాతనినే తమకు దూతగా దమయంతికడ కనిపిరి. దమయంతియందు చిరకాలమునుండి మోహముకలిగి యామెను వివాహమాడు ఘనాశతో నలుఁడు స్వయంవరమునకు బోవుఁచున్నాడు. లోకములో కాంతాకనకములవిషయమైన మోహమెట్టిదియొ యెల్లరెఱింగిన విషయమే. ఈ సందర్భముననే యెంతటి నీతిమంతుడైనఁ బడిపోవుట; కాన నీవిషయముననే దేవతలు నలుని విమర్శలోబెట్టిరి. కానియాతఁడు మోహపాశములచే బంధింపఁబడక తనదౌత్యమును యధాన్యాయముగా నడిపినాఁడు కానియచట కపటకృత్యమేదియును జేయలేదు. ఈవిషయమీతని సత్యసంధతను వేవిధములఁ జాటుచున్నది. కాన నలుఁడు గ్రంథములోఁ దెలుపఁబడినట్లుగా నిత్యసత్యవ్రతుడనుటకు దెలిసినవారెవరును వెనుదీయరు.