Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/420

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నలుఁడు, సత్యసంధత.

393

disciple Chundra Shekhur Dev as the author. we have the authority, of Babu Chundra Shekhur Dev himself for this statement, Ed."

(పలుమారు తాను చేయుచు వచ్చినట్లు ఇదివ్రాసినది తనశిష్యుఁడైన చంద్రశేఖరదేవుఁడైనట్లుగా నాతని పేరుంచినను దీనిని రాజారామమోహసరాయలవారే వ్రాసిరి. దీనికి బాబూ చంద్రశేఖరదేవువారేసాక్ష్యము.)

దీనినిబట్టి రామమోహనరాయలవారి నమృతవాదు లనవలసియుండునేమో మాబ్రాహ్మసామాజికపు సోదరులలోచించుకొందురుగాక, ఇదిమాఱుపేఱు పెట్టుకొనుటకాదా?

(2) ఈప్రాంతములందలి బ్రాహ్మసామాజికపు సోదరులలో రావుబహదర్ కందుకూరివీరేశలింగము పంతుల వారుప్రథమగణ్యులుకదా. ఈమహాపురుషులు కొక్కొండవెంకటరత్నము పంతుల వారి విగ్రహతంత్రముపై విమర్శ వాసి దానిని అ॥ క॥ అనుఒకగుణాగుణప్రదర్శ నీసమాజికుఁడు వ్రాసినట్లు విమర్శాంతమునఁ గనుపరచిరి. అంతియకాక విమర్శనములో “వీరేశలింగముంగారు” వీరేశలింగముగారు” అని వాడుకొనుటచే నీవిమర్శనమును మధ్యవర్తు లెవరో వ్రాసినట్లు లోకమునకుఁ దోచకపోదు. అట్లే చాలకాలము తలంచుచుంటిమి. ఇంతలో నీనడుమ శ్రీతోలేటి సుబ్బారావుగారిచే వ్రాయఁబడిన శ్రీ పంతులవారి వూతచారిత్రము బయలువెడలినది. అందీవిమర్శనము పంతులవారే వ్రాసి