392
ఉపన్యాసపయోనిధి.
లిగింపలేదు. తనకు ననుచితమగు లాభమును గలిగింపలేదు. అట్లుగాక తానునలుండనని నిజమేచెప్పినచో ఋతువర్ణుఁ డెన్నటికిని అతనిని తనకింకరునిగాఁ దీసికొనఁడు. ఏపనియుఁ జెప్పకయే యన్నవస్త్రము లిచ్చుటకు యత్నించును. అట్లు చెడి యొకనికడఁజేరి బ్రతుకుటకంటె యేదోయొక వ్యాపారము చేసికొని బ్రదుకుట యుచితముకదా. కాన నలుఁడట్లు చేసినాఁడు.
అట్లుకాదనియు నెన్నఁడును మాఱుపేరు పెట్టుకొనంగూడదనియు నట్లుమారుపేరును బెట్టుకొనుట యసత్యమునుదోషమునగునందురేని లోకములోని వివేకులలో సత్యవాదు లుందురనుటకే యైతికాదు. ఇది మా బ్రాహ్మసామాజిక సోదరులకు బోధపడుటకై బ్రాహ్మసామాజికులలో నుండియే యొకటి రెండుదాహరణము లిచ్చెదము.
(1) రాజా రామమోహనరాయులవారు బ్రహ్మసమాజ మతమునకు మూలపురుషులు. వీరిని ధర్మస్వ రూపులనుగా లోకులు భావించుచున్నారు. నీతిమంతులలో జాలఘనులు ఇట్టిపూతచారిత్రులు తమశిష్యులగు చంద్రశేఖరదేవులఁ పేరుపెట్టుకొని కొన్ని వ్యాసములను వ్రాసియున్నారు. ఇందునుగూర్చి రామమోహన రాయులవారి గ్రంథములలో వానినిబ్రకటించిన వారిచే నిట్లువ్రాయఁబడి యున్నది.
"It was written by Raja Rammohon Roy, though as he did on many other occasions, he put the name of his