Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/416

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నలుఁడు, సత్యసంధత.

389

నలుఁడు, సత్యసంధత.

ఈ నడుమ బడిపిల్లలు కొందఱు సమాజము నొకదాని నేర్పఱచుకొని యందువాగ్ధోరణిగుదురుటకై యొక్కొక్క విషయమునే తీసికొని చర్చించుకొనుచుండిరి. ఒకనాటిసభలో సత్యముఁగూర్చి చర్చించుకొన నిశ్చయించుకొని బ్రహ్మసమాజమతస్థుఁడగు తముయుపాధ్యాయుని నాడు సభాధ్యక్షత వహింపఁ గోరికొనిరి. దయాస్వరూపు డనంబడు నాయుపాధ్యాయుని యధ్యక్షతమీఁద నాటిసభ బాగుగాజరిగినది. విద్యార్థులు ప్రసంగవశమున నలుని నిత్య సత్యవ్రతుఁడని కొనియాడిరి. బాలుర ప్రసంగములైనతరువాత సభాధ్యక్షుఁడగు నాబ్రాహ్మ సామాజికాగ్రణిలేచితన యుపసంహార వాక్యములలో "బాలుడు నలుఁడు సత్యవ్రతుఁడనినుడివెనుకాని యదితప్పు. ఋతువర్ణుని కడఁకాతఁడు పోయినప్పుడు తనపేరునుదాచుకొని తానుబాహుకుఁడని బొంకినాఁడు కాన నలుడుఁ సత్యవ్రతుఁడు కాఁడు" అని గంభీరనాదముతోఁబలికెను. ఇది పెద్దవిపరీతము. ఇట్టి విపరీతవాక్యములు పాఠశాలోపాధ్యాయుని నోటనుండి వచ్చినవికావు ననునయ్యవి విద్యార్ధులముందురఁ బలుకఁబడినవి కావునను నీపలుకుల నొకింత విమర్శించుట యవసరమైనది.