బ్రహ్మమతము - ఈశ్వరవాది.
379
దర్థములేనిశ్రాద్ధములు కలవని తెలియవచ్చుచున్నది. అయినను యిదిపరిశుద్ధాస్తికమతము యున్నతమతమునై యున్నది.
స్వేచ్ఛగా తినవచ్చునను తలంపున నిందు కొందఱు చేరుదురని బ్రాహ్మసామాజికులే వ్రాసియున్నారుకదా. ఇఁక కృష్ణాపత్రికలో వల్లూరు సూర్యనారాయణరావు బి. ఎ. బి. ఎల్. గారిట్లు వ్రాసియున్నారు చూడుఁడు.
"ఇది (అందఱును గలసిభుజించుట) మనచేతఁగాదేని మనమందరము బ్రాహ్మమతము పుచ్చుకొనిన మంచిదని తోఁచుచున్నది” అని వ్రాయించిరి. దీనినిఁబట్టి స్వేచ్ఛగా దిన నిచ్ఛకలవారు బ్రాహ్మసమాజమున గలియవలెనని తేలుచున్నది. వీరికి ముక్తిప్రథాన వేదాంతము లేదుగాని భుక్తిప్రధానవేదాంతము కలదుకాఁబోలును. అయినను నిది పరిశుద్ధాస్తికమతమను నున్నతమతమునై యున్నది. ఎవరిమతము వారికట్లు కాన్పించుట వింతకాదు. ఆందులకు మనసోదరులగు నీశ్వరవాది పత్రికాధిపతిగారు లోకమునకు బోథలోనికివచ్చుటకై తమమతధర్మముల బ్రఁకటింతుమని వ్రాయించినారు. ఇదిచాలమంచిపనిగా తలంచుచున్నాము. సత్యము బ్రకటించినందులకు మాసోదరులు మాపైఁ గోపించకుందురుగాక. తమమతముతమకు పరిశుద్ధమును నున్నతము నైనట్లె యితరులకును దమతమ మతములు పరిశుద్ధములు నున్నతములునని గ్రహించుకొందురుగాక.
సర్వేజనాస్సుఖినోభవన్తు.