376
ఉపన్యాసపయోనిధి.
to some of the sanyasis assembled on the occasion (5). Pandit Goswmi joins in un-Brahmic ceremonies such as the Brahmanical Upanayana, performed by his disciples (6). he holds & acts on the principle let every one continue to believe what he does he will in time attain truth.'
1. పండితుండగు గోస్వామి విశిష్టాద్వైతోత్సవముల వైష్ణవమతరీతిగా నొనర్చినాఁడు. వైష్ణవులు పాడుపాటలును పూజలును ఇందుపయోగింపఁబడినవి. 2. ఈసమయమున నపవిత్రములైన వైష్ణవ కీర్తననములు పాడఁబడినవి. 3. ఇత్తఱి విరాగిణులు (స్త్రీలు) పురుషులతోఁ గలసి నాట్యముచేసిరి. 4. ఇక్కాలమున నచటికి వచ్చియున్న బైరాగులకు గంజాయి పంచిపెట్టఁబడినది. 5. తనశిష్యులచే జరపఁబడినట్టియు బ్రహ్మసమాజ విరుద్ధములగునట్టియు నుపనయనాదికిములు జరుపుటలో గోస్వామి యేకీభవించినాఁడు. ఎవరి యిష్టానుసారముగా వారు నడచినదుదకు సత్యమును గనుగొనఁ గలరని గోస్వామి చెప్పి పనిచేసినాఁడు.)
వీనినన్నిటిని బట్టిచూచిన హిందువులందు మూఢములైన కృత్యములని వేనిని బ్రాహ్మసామాజికులు నిందించుచున్నారో వానినే తమ బ్రాహ్మసామాజికాగ్రగణ్యులును నొనర్పుచున్నారని స్పష్టపడు చున్నదిగదా. ఇది బ్రహ్మసమాజమతముయొక్క పరిశుద్ధాస్తికతయును నౌన్నత్యమును.
ఇఁక నీపరిశుద్ధాస్తికోన్నత మతమునగలవిశేష మేమనిన ఒక్కహిందువులందుఁ గల విగ్రహారాధక కృత్యములనే