బ్రహ్మమతము - ఈశ్వరవాది.
371
హ్మసామాజికపు సోదరులు 'హిందూమహాజనసభ' మున్నగు ప్రహసనములను వ్రాసి వాసింగాంచియున్నారు. ఎవరిమోమువారికి గాన్పింపదుగదా!
ప్రకృతి నారాధించుట.
పోనిండు శాఖలలో నంతఃకలహము లుండినను వీరియారాధనములోఁ పరిశుద్ధాస్తికతయు నౌన్నత్యమును నున్నవేమోయనిన నవియు సున్నయే. తమహిందూసోదరులు అగ్నినారాథింతురనియు నుదకముబూజింతురనియు హేళనముచేయువీరు అగ్నినారాధించు వారుగను జలాదులను బూజించువారుగను నున్నారు. ఈక్రిందియంశము చదువరులసంశయ నివారణము చేయగలదు.
కేశవచంద్రసేనులనువారగ్నిని ఆరాధించిహోమమువేల్చిరి. అగ్నిలో సమిథలనుంచి యాజ్యహోమముజేసియగ్ని నిట్లు స్తుతించిరి.
'O thou blazing Agni (fire) great, great art thou, great among the forces of creation. We shall honor thee and magnify thee because of thy greatness & majesty. Thou art not God. We do not adore thee but in thee dwells the Lord, the Eternal Inextinguishable Flame, the Light of the Universe, the ineminent Fire, Fire of fire whom fire doth reveal & glorify. O thou brilliant Agni, in thee we hold our Resplendent Lord'