Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/393

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

366

ఉపన్యాసపయోనిధి.

ర్చి గ్రంధవిస్తరము చేయనవసరములేదు.

మహమ్మదీయులు క్రైస్తవులు బ్రాహ్మసామాజికులు పనిపూని హిందూమతమును అధిక్షేపించుచుందురు గావున స్వమత రక్షణార్థమై హిందూమతస్థులు పరమతము లందలి లోపముల నెత్తిచూపుచున్నారేకాని దుర్వృత్తితోఁగాదని మాసోదరులును తలంపవలెను.

మాబ్రాహ్మసామాజిక సోదరులు తమది పరిశుద్ధాస్తికమతమనియు నున్నతమతమనియుఁ జెప్పికొనుటతోఁ దృప్తినందక పరమతములఁ బరిపరివిధముల నిందింపుచున్నారు గాస నీనూత్నమతముయొక్క పరిశుద్ధత యెట్టిదో యౌన్నత్యమెట్టిదో యించుక లోకులకు బోధలోనికిఁ దెచ్చుచున్నారము. మేము బ్రహ్మసమాజమనిన జుట్టుకత్తెరింపుల మతమనినుడువలేదు. బ్రాహ్మసామాజికులే తమ సత్యవాదినిలో బ్రహ్మసమాజ మతమనిన లోకులు జుట్టుకత్తెరింపుల మతముగాఁ దలంచుచున్నారు అని వ్రాసికొనియున్నారు. ఆ విషయముననే మేముదహరించితిమి. మేమీ యపవాదమును వేయలేదు. లోకములో నిదివరకే యీయపవాదముకలదు. ఇదియూరక పుట్టలేదని మేముచెప్పి యున్నమాట సత్యము. ఆకారణముల నీక్రింద నిచ్చుచున్నారము.

I. ఈ బ్రహ్మసమాజమతమున కివి ధర్మములని యెచ్చటను జెప్పబడి యుండలేదు. బ్రహ్మ సమాజమత ధర్మములేవియనినఁ దెలుపు గ్రంథమేదియులేదు. ఈవాక్యముల