Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/388

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బ్రహ్మసమాజమతము హిందూమతమా?

361

న కనేకశాఖలుగలవు. ఇప్పుడిదియొక నూత్న పల్లవమైనచో హిందూమత మహావృక్షము శాఖోపశాఖలుగా నిట్లు వ్యాపించుచున్నందులకు హిందువైనవాఁడెవ్వఁడు సంతసింపడు ? సంతసించునుగాని యిది బదనిక గాని శాఖకాదు. అందులకై విచారింపవలసియున్నది.

పురాణమతము వేఱా?

"మేము హిందూమతమని చెప్పునప్పుడు సామాన్యజనాదరణీయమైన పౌరాణికహిందూమతమనియు బ్రహ్మమతమని చెప్పునప్పుడు ఉపనిషద్భోధితమైనయుత్తమహిందూ మతమనియుగమనింపఁ గోరుచున్నాము" అనియీశ్వరవాదిపత్రికాదిపతులు వ్రాయించిరి. దీనివలన ఉపనిషద్ బోధితమైన హిందూ మతమువేఱును పురాణబోధితమైన హిందూమతమువేఱును నై యున్నవని వీరి తాత్పర్యమైనట్లు స్పష్టమగుచున్నది. ఇదితప్పుటూహ. ఉపనిషణ్మతమే పురాణమతము. పురాణమతమే యుపనిషణ్మతమునై యున్నవి. ఇందులకుఁ బ్రమాణముల నీక్రిందనిచ్చుచున్నాము.


1 శ్లో॥ ఇతిహాసపురాణాభ్యాం వేదార్ధముప బృంహయేత్ ।
     భిభేత్యల్పశ్రుతాద్వేదోమామయంప్రహరిష్యతి ॥

వసిష్ఠస్మృతి.



2 శ్లో॥ వేదోపబృంహణార్ధత్వాత్ పురాణంవేదఏవహి ।
     వేదోపాంగవిధి త్వేనపురాణంవేదఏవచ ॥"

పంచరత్న వ్యాఖ్య.