360
ఉపన్యాసపయోనిధి
మర్త్యుఁడును అమర్త్యుఁడును, మనకొఱకై తననుదేవునికిపరిమళ వాసనార్థకమైన కానుకగను యాగపశువుగను అర్పించుకొనినవాడును ఇదివరలో చేయబడిన యాగార్పణలు అన్నియు ఎవనియొక్క సూచనలును ప్రతిబింబములును అయ్యున్నవో అట్టివాఁడును తనమరణమువల్ల అనఁగాతనను యాగపశువుగ అర్పించుకొనినందువల్ల మృత్యువును జయించి సువార్తద్వారా ప్రాణమును అమరత్వమును వెలుతురులోనికి తెచ్చినవాఁడును, అయినబయిబిలులోని క్రీస్తువివరణకు ఆశ్చర్యముగ పోలియున్నది. వేదములో చెప్పియున్న ప్రజాపతి లక్షణములన్నియు క్రీస్తుప్రభువునుగురించి పయిన చెప్పఁబడినవర్ణనకు ఆశ్చర్యముగ సమీపించుచున్నవి కనుకనే క్రీస్తుమతమునందలి రక్షణార్ధమైన పరమరహస్యములను ఆశ్చర్యముగ దృఢపరచుచున్నవి."
ఈవిధముగ శ్రుతులును శ్రుత్యంతములును క్రీస్తుమతమును బోధించుచున్న ట్లె బ్రహ్మసామాజ మతమునుగూడ బోధించుచున్నవి. ఆహేతువుచే క్రీస్తుమతము హిందూమతమగుచో బ్రహ్మసామాజమతమును హిందూమతమేయగును. కానిండు దాన నేమియు హాని లేదు. ఇదివఱకు “మేము హిందువులముకాము క్రీస్తుశిష్యులము” అని భావించుకొనినబ్రాహ్మసామాజిక సోదరులిప్పుడు హిందువులమేయనియు దమది యుపనిషణ్మతమేయనియుఁ జెప్పుకొనుచున్నందులకు మేమును సంతసించుచున్నాము. ఇదివఱకే హిందూమతము