Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/386

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బ్రహ్మసమాజమతము హిందూమతమా?

359

యినట్టియు సృష్టికిపూర్వమే కలిగినపురుషుడును విశ్వకర్మయును అయ్యున్న ఆప్రజాపతి తనను తానే యాగపశువుగ నర్పించుకొనెను”


“సోకాయమత మేధ్వంమఇదంస్యాత్ ఆత్మన్యనేనస్యామ్"


"అనగా బృహదారణ్యకమను ఉపనిషత్తు" ప్రజాపతి గొప్పయజ్ఞము చేయుటకుఁదలఁచి యజ్ఞమునకుతగిన శరీరము నాకుకలుగునుగాక. అందులోనే నేనవతరింతునుగాక. అనియు"


“తస్మాత్సర్వదైవత్యంప్రౌక్షితం ప్రాజాపత్యమాలభంత। యాజ్ఞికా ఏనంఏషవా అశ్వమేధః"


“అనగా యాజ్ఞికులు అశ్వమేధయాగమును చేయునపుడు సాక్షాత్తు ప్రజాపతినే అనగా సర్వేశ్వరునే వథించినట్లు అర్పించిరి. అనియు"

"శతపథబ్రాహ్మణము ప్రజాపతినిగురించి ఆయన సగముమర్త్యుడనియు, సగము అమర్త్యుడనియు చెప్పి


“తస్యహప్రజాపతేరర్ధమేవమర్త్యమాసీనర్ధమమృతం”


అని యున్నదనియు మొదలయిన సంగతులుచెప్పి తుది నిట్లు క్రైస్తవులు సిద్ధాంతీకరించిరి.


"ప్రజాపతి తననుతానే యాగపశువుగ నర్పించికొనిన సంగతి విషయమయి యిదివఱకు చెప్పినవి యావత్తును దేవుఁడును మనుజుఁడును మనకుసాక్షాత్తు యిమ్మానుయేలును