358
ఉపన్యాసపయోనిధి
మాజికులు క్రైస్తవుల ననుసరించిరిగాని యుపనిషత్తుల ననుసరింపలేదు. తాముహిందువులము కామని యిదివఱకుఁ జెప్పుకొనినారు. తాము క్రీస్తుమార్గము ననుసరించుచున్నామని నొక్కివక్కాణించియున్నారు. ఈవాక్యముల నన్నిటిని ఇప్పటి బ్రాహ్మసామాజికాగ్రగణ్యులగు పండితశివనాధశాస్త్రిగారే వ్రాసియున్నారు. ఇట్టివారు తమది యుపనిషణ్మతమనుటకు సాహసించిన నింతకంటె వింత వేఱండుండఁగలదా.
క్రీస్తుమతము హిందూమతమేలకాదు.
క్రీస్తుమత వికారమైన బ్రహ్మసమాజమతము వేదమతమైనచోఁ గ్రీస్తుమతము మాత్రము వేదమతముకాదా! ఏలకాదు. ఈ విషయమై యిదివఱకే క్రైస్తవులు గ్రంథములువ్రాసియున్నారు. వారాగ్రంధములలోఁ జెప్పినవాక్యములనీక్రింద నిచ్చుచున్నాము. "క్రీస్తుమతమునకును హిందూమతమునకునుండు సంబంధము" అనుగ్రంధములో క్రైస్తవులిట్జువ్రాసిరి: —
"ఈయజ్ఞమున కింతయాధిక్య మెందువలన కలిగినదంటే సామవేదములోని తాండియమహాబ్రాహ్మణములో"
“ప్రజాపతిర్దేవేభ్యఆత్మానంయజ్ఞంకృత్వాప్రాయచ్ఛత్"
“అనగా, ఈజగత్తునకు సృష్టికర్తయు, రక్షకుడును అ