బ్రహ్మసమాజమతము హిందూమతమా?
357
"సత్యమేవజయతినానృతమ్" ముండకోపనిషత్తు.
అవసరమునుబట్టి బ్రహ్మసమాజ మతమునకునుహిందూమతమునకుంగల భేదమును మేమిదివఱకే విపులముగాఁ జూపియున్నాము. దానినంతను జదివి యీశ్వరవాది పత్రికాధిపతిగారు కారణమును దెలుపకయే యధఃకరింప ప్రయత్నముచేయుచుఁ దమది యుపనిషణ్మతమనియుఁ దమదియే నిక్కమైన హిందూమతమనియుఁ జెప్పసాహసించిరి. మతమునకు బ్రధానమైనది యాత్మజ్ఞానము, ఈవిషయముననే వీరుపనిషణ్మతము నంగీకరించుటలేదు. ఎట్లన, ఆత్మనిత్యము అనఁగా నుత్పత్తియు నాశమునులేనిదియని యుపనిషత్తులు ఘోషించుచున్నవి. బ్రాహ్మ సామాజికులన్ననో యాత్మకు నాశములేదుగాని యుత్పత్తికలదని చెప్పుచున్నారు. ఆత్మకుఁ బునర్జన్మముకలదని యుపనిషత్తులు చాటుచున్నవి. బ్రాహ్మసామిజికులాత్మకుఁ బునర్జన్మము నంగీకరించుటలేదు. ఉవనిషత్తులు కర్మమనాదియని చెప్పుచున్నవి. బ్రాహ్మసామాజికు లీసిద్ధాంతము నంగీకరింపక పోవుటయేకాక యధిక్షేపించుటకుఁగూడ సాహసించుచున్నారు. ఉపనిషత్తులు జగదుత్పత్తికిఁగారణము పరిణామమని చెప్పుచున్నవి. బ్రాహ్మసామాజికులు దీనికి సృష్టికారణమని చెప్పుచున్నారు. అనఁగా అభావమునుండియే భగవంతుఁడీజగత్తును గల్పించినాఁడని చెప్పుచున్నారు. ప్రథానాంశములలోనే భేదములిట్టివనేకములుకలవు. ఈసిద్ధాతములన్నిటియందును బ్రాహ్మసా