356
ఉపన్యాసపయోనిధి
నగువివేకానంద స్వాములవారు బ్రహ్మసమాజికులనుగూర్చి యిట్లు వ్రాసియున్నారు.
"What harm to the Christian Missionary that the Hindus are trying to cleanse their own houses? what injury will it do the Brahma Samaj and other reform bodies that the Hindus are trying their best to reform themselves. Why should they stand in opposition? why should they be the greatest enemies of these movements? why? I ask. It seems to me that their hatred and jealousy are so bitter that no why or how can be asked there."
(హిందువులు తమ్ముఁదాము బాగుచేసికొనఁబ్రయత్నించినదాన క్రైస్తవమిషనరీలకేమిహాని? హిందువులు తమ్ముదాము సంస్కరించుకొనఁ బ్రయత్నించిన దానబ్రహ్మసమాజికులకును నితరసంఘ సంస్కర్తలకును నేమిహాని? వీరేలయభ్యంతర పెట్టవలయును? వీరేల యీయుద్యమములకు ఘనశత్రువులు కావలెను? అదేలయని యడుగు చున్నాఁడను. వారల గిట్టని తనమునకును మాత్సర్యమునకును అకాండ తాండవమైన గమనిక కలదని తలంచెదను.)
పైవాక్యములనుబట్టిచూచిన హిందువుల మనుకొనువారికి క్రైస్తవులవలెనే బ్రాహ్మసామాజికులును గర్భ శత్రువులై హిందువుల బాగునుజూచి యోర్వజాలనివారలై యున్నారని బాలునికైనను బాగుగా బోధపడఁగలదుగదా. ఈ వాక్యములు నర్వవిధముల సత్యములగుచున్నవి.