352
ఉపన్యాసపయోనిధి
న్నవి” ఇట్లుండ జన్మపరంపర నంగీకరింపని బ్రహ్మసమాజమతము హిందూమతమెట్లు కాగలదు. క్రైస్తవ మతస్థులనేకులు పునర్జన్మవాదము నంగీకరింపరు. వానిననుసరించినదీమతము. ఇట్టిదానిని పరిశుద్ధహిందూమతమనుట యజ్ఞానముచేతనైనఁ గావలెను. లేకున్న మోసపుతలంపు నైనను గావలెను. (2) హిందూమతములన్నియు పశుపక్ష్యాదులందును శిలాపర్వతాదులందునుగూడ నాత్మకలదని చెప్పుచున్నవి. ఈనడుమ "బోసు" గారు లోహములకుఁ బ్రాణముకలదని కనిపెట్టి" నాపూర్వులు గంగాతీరమునఁ జిరకాలముక్రిందఁ గనిపెట్టినదానిని నేడు నేను దెలిసికొను స్థితికివచ్చినందుకు సంతసించుచున్నానని చెప్పిన వాక్యములు విూకెల్లరకు జ్ఞప్తియందుండియే యుండవచ్చును “శిలాపర్వతాది జడపదార్ధముల యందాత్మయుండునని చెప్పెడుమనవారి సిద్ధాంతము” అని రా॥ బ॥ వీరేశలింగము పంతులవారి వ్రాతవలన శిలాపర్వతాదులందును పశుపక్ష్యాదులందును జీవు నంగీకరించుట హిందూమత లక్షణమని బాలుఁడైనను గ్రహింపఁగలఁడు. మనుష్యులందు మాత్రమే యాత్మ కలదని క్రీస్తుమతము. ఈమతము ననుసరించి బ్రహ్మసమాజ మతమును మనుష్యునందుమాత్రమే యాత్మ నంగీకరించుచున్నది. ఇది యిఁక హిందూమతమెట్లుకాఁగలదు? ఇఁక మావీరభద్రరావుగారికిఁ దెలివితేట లెట్లుండఁగలవు? (3) కర్మయనాదియనునవి హిందూమతములు "కర్మయనాదియని యు