Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/377

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

350

ఉపన్యాసపయోనిధి

ష్యమైన యారాధనలకు లోఁబడియుండుటయు మతమనగా నాచారమేయనియు, మతధర్మములనగా బాహ్యాడంబరములనియు నెంచఁబడుచుండుటయు సంభవించుటచే నీబ్రహ్మసమాజమతస్థాపన కవసరమప్పుడుగలిగినది. తరువాత రామకృష్ణ పరమహంసగారి చేతను వివేకానందులు, అనిబెస్సాంటు మొదలగువారిచేతను హిందూమతధర్మములను జక్కగాఁ దెలిసికొనఁగలిగిన మనవారందఱును గారణాంతరములవలన హిందూమతమునఁ జేరిన దురాచారములను నిరాకరించి యాషన్‌మతానుసరణముగా హిందూమత మవలంబించుచుండుటచే రామమోహనరాయలు బ్రహ్మసమాజమతస్థాపనవలన బోధించిన పరిశుద్ధాస్తిక ధర్మములు హిందూమతధర్మములేయని గుర్తెఱిఁగి వాటిననుష్ఠించుచున్నారు. హిందూమత మితరమతములనుండి నేర్చుకొని యవలంబింపవలసిన నూతనధర్మములేమియునులేవు. హిందూమతమున లేని యుత్తమథర్మములుగాని పరిశుద్ధాచారములు గాని యేయితరమతమందునుగానరావు. బ్రహ్మసమాజమతము క్షీణదశకు వచ్చుటవలనఁ గేవలజ్ఞానమార్గానుసరణమై సామాన్యజనులకనుష్ఠానయోగ్యము గాని మతముచిరకాలముభివృద్ధి నొందనేరదను నంశము విశదీకరించుచుఁ దానేమతమునుండిశాఖాయ మానముగా వెలువడియెనో అట్టిమతమయిన హిందూమతమునఁ గ్రమక్రమముగా సంగమించి యంతరించుచు హిందూమతోత్కృష్టతను జగద్విదితముచేసి చాటించుచున్నది